![]() |
![]() |

సూపర్ సింగర్ షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించడానికి రాబోతోంది. ఐతే ఈ షోలో ఒక వెరైటీ సెగ్మెంట్ జరిగింది. సూపర్ సింగర్ ఒకవేళ 2050 లో జరిగితే ఎవరెవరు ఎలా ఉంటారో తెలుసా అంటూ ఇప్పటి ఫొటోస్ కి టెక్నాలజీని వాడి ఫ్యూచర్ ఫొటోస్ లో ఎలా ఉంటారో చూపించింది. సోనియాగాంధీ లుక్ లో శ్రీముఖి మంచి ఇంగ్లీష్ కాస్ట్యూమ్ తో నవ్వుతూ కనిపించేసరికి ఆ పిక్ ని చూసిన తెగ సిగ్గు పడిపోయింది. ఇక మంగ్లీ లుక్ ఐతే వేరే లెవెల్ లో ఉంది. ఇంగ్లీష్ వాళ్ళ లుక్ తో కలర్ ఫుల్ కాస్ట్యూమ్ తో నవ్వుతూ కనిపించిన ఆ పిక్ చూసి అందరూ షాకైపోయారు. మంగ్లీ తన ఫోటో తానే చూసుకుని తల దించేసుకుని నవ్వేసుకుంది.
అలాగే షోలోని కొంతమంది లేడీ సింగర్స్ ఫొటోస్ ని కూడా ఇలా మార్చి చూపించేసరికి వాళ్ళు కూడా తెగ సంబరపడిపోయి ఫుల్ గా నవ్వుకున్నారు. ఇలా ఒక సెగ్మెంట్ సూపర్ సింగర్ స్టేజిని నవ్వులతో ముంచెత్తింది. ఇక ప్రవస్తి అరుంధతి మూవీలోని "పాడనా విలయ కీర్తన" సాంగ్ కి జడ్జెస్ ఫిదా ఇపోయారు. ఇక ఈ సాంగ్ ని మంగ్లీ, అనంత శ్రీరామ్ స్పూఫ్ గా చేసి చూపించారు. "ఒసేయ్ అరుంధతి..వస్తా నిన్నెత్తుకుపోతా" అని శ్రీరామ్ మంగ్లీ మీద డైలాగ్ వేసేసరికి "నువ్వు నన్నేం చేయలేవురా" అంటూ గట్టిగా డైలాగ్ చెప్పింది. ఇలా ఈ స్పూఫ్ అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఇక ఫైనల్ లో సాహితి మాయాబజార్ సాంగ్ పడేసరికి కోటి, అనంత శ్రీరామ్ ఫుల్ ఫిదా ఇపోయారు. "ఈ సూపర్ సింగర్ సెట్ ని మాయాబజార్ చేసినందుకు నీకు అభినందలు" అని చెప్పారు అనంత శ్రీరామ్. తర్వాత శ్వేతా ఒక అద్భుతమైన సాంగ్ పాడి వినిపించేసరికి కోటి ఫుల్ జోష్ తో ఆమెను పొగిడేసాడు. "ఎం పాడావమ్మా... చాలా ప్రొఫెషనల్ గా పాడావ్" అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అలాగే జడ్జెస్ కి మరో టాస్క్ ఇచ్చింది. రోల్ రివర్స్ ఐతే ఎలా మాట్లాడతారు అంటూ చెప్పింది. అందులో అనంత శ్రీరామ్ శ్వేతా మోహన్ లా, రాహుల్ సింప్లి మంగ్లీలా, శ్వేతా మోహన్ అనంత్ లా మాట్లాడి అలరించారు.
![]() |
![]() |